భారతదేశం, ఆగస్టు 15 -- 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని బలంగా ఉంచే నాలుగు స్తంభాలు అయిన నాలుగు విలువలను మన రాజ్యాంగం ప్రస్తావించిందని, అవి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అని గుర్తు చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాష్ట్రపతి అన్నారు. ప్రతి భారతీయుడు స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ప్రతి మనిషి సమానమేనని, అందరినీ గౌరవంగా చూడాలని రాష్ట్రపతి అన్నారు. అందరికీ ఆరోగ్య సంరక్షణ, విద్యలో సమాన ప్రవేశం ఉండాలన్నారు. అందరికీ సమాన అవకాశాలు లభించాలని చెప్పారు...