భారతదేశం, ఏప్రిల్ 29 -- భారత్-పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ స్టాక్స్ భారీ ర్యాలీ ని చూస్తున్నాయి. ముఖ్యంగా హెచ్ఏఎల్, మజగావ్ డాక్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తదితర రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీల షేర్లు 4 నుంచి 14 శాతం వరకు లాభపడ్డాయి. యుద్ధ సమయాల్లో సైనిక పరికరాలకు పెరిగే డిమాండ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం పెరిగే అవకాశం ఉందనే అంచనాలే ఈ ర్యాలీకి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

డిఫెన్స్ స్టాక్ లో మంగళవారం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేరు ధర అత్యధికంగా లాభపడింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేరు ధర ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.2020కి పెరిగింది. ఇది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేరు ధర కోసం మునుపటి రోజుల ముగింపు స్థాయిలతో పోలిస్తే 15% కంటే ఎక్కువ.

మజగావ్ డాక్ ...