భారతదేశం, జూన్ 19 -- భారత్- పాక్ ల మధ్య భారీ యుద్ధం జరిగే ప్రమాదాన్ని తానే నివారించానని పలుమార్లు పలు వేదికలపై చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కాస్త వెనక్కు తగ్గారు. తన వల్లనే ఆ యుద్ధం ఆగిందని చెప్పకుండా, ఆ సమయంలో ఆ రెండు దేశాల నాయకులకు ట్రేడ్ డీల్స్ ఆఫర్ చేశానని చెప్పారు. అయితే, కాల్పుల విరమణ నిర్ణయం ఆ ఇద్దరు "చాలా తెలివైన" నాయకులు తీసుకున్నారని స్పష్టం చేశారు.

పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు వైట్ హౌస్ లో లంచ్ ఇచ్చిన అనంతరం బుధవారం ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను అతన్ని (పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్) ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం, యుద్ధంలోకి వెళ్ళనందుకు, యుద్ధాన్ని ముగించినందుకు నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున...