భారతదేశం, మే 9 -- పాకిస్థాన్ డ్రోన్లను ఉపయోగించి ఉత్తర భారతదేశంలోని పలు నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తరువాత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలను మే 10 వరకు మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. తర్వాత మే 15 ఉదయం వరకు పొడిగించారు. జమ్మూ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడి తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ దాడి పాకిస్థాన్ నుంచే జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు వేగంగా స్పందించి క్షిపణులు, డ్రోన్లను నిలిపివేశాయి. దీంతో పలు నగరాల్లో వైమానిక దాడుల సైరన్ మోగింది. తర్వాత విమానాశ్రయాలను కూడా మూసివేస్తున్నట్టుగా కూడా ప్రకటన వచ్చింది.

సంబంధిత అధికారుల తాజా ఆదేశాలకు అనుగుణంగా విమానాశ్రయ మూసివేత కారణంగా మ...