భారతదేశం, మే 1 -- పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ తమపై ప్రతీకార దాడికి దిగుతుందన్న భయాల నేపథ్యంలో, పాకిస్తాన్ కొత్త జాతీయ భద్రత సలహాదారును నియమించింది. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టర్ జనరల్ గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్ కే జాతీయ భద్రతా సలహాదారు (NSA) బాధ్యతలను అప్పగించింది. ఐఎస్ఐ చీఫ్ గా కూడా ఆయనే కొనసాగుతారని, ఎన్ఎస్ఏగా అదనపు బాధ్యతలను చేపడ్తారని వివరించింది.

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందడంతో భారత్ నుంచి సైనిక ప్రతిస్పందనపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్ఎస్ఏ గా మహ్మద్ అసిమ్ మాలిక్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ క్యాబినెట్ డివిజన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మహ్మద్ అసిమ్ మాలిక్ కు అధికారికంగా ఎన్ ఎస్ ఏ బాధ్యతలు అప్పగించారు. డీజీ (ఐ) లెఫ్టినెంట్ జ...