భారతదేశం, జనవరి 7 -- స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు 2026 సంవత్సరం అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. ఈ ఏడాది మొదటి ఐపీఓగా భారత్ కోకింగ్ కోల్ (BCCL) రంగంలోకి దిగుతోంది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన బిసిసిఎల్, రూ. 1,071 కోట్ల నిధులను సేకరించే లక్ష్యంతో జనవరి 9న తన పబ్లిక్ ఇష్యూను ప్రారంభించనుంది. గ్రే మార్కెట్ అంచనాల ప్రకారం, ఈ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తోంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, బిసిసిఎల్ ఐపీఓ గ్రే మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 11.1 ప్రీమియం వద్ద ట్రేడవుతోంది. అంటే, అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ. 23తో పోలిస్తే సుమారు 48 శాతం లాభంతో (దాదాపు రూ. 34 వద్ద) షేర్లు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, గ్రే మార్కెట్ ప్రీమియం అనేది కేవలం అంచనా మాత్రమేనని, కంపెనీ ప్రాథమిక అంశాలను బట్టి పెట్టుబడి నిర్ణయాలు ...