భారతదేశం, జూన్ 2 -- దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీని పెంచే లక్ష్యంతో కొత్త పథకంతో ముందుకు వచ్చింది భారత్. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజాలకు డోర్స్ ఓపెన్ చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన విధానానికి సంబంధించి అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది. స్థానికంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి నిర్మించడానికి సిద్ధంగా ఉన్న విదేశీ ఈవీ మేకర్స్‌‌కు దిగుమతి సుంకం కోతలను అందిస్తోంది.

భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించే కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మార్గదర్శకాలను రూపొందించింది. కానీ వాహన తయారీదారులు ముందుగా రూ.4,150 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అర్హత సాధించడానికి నియమాలను పాటించాలి. కొత్త నియమాలు ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను భారతదేశ...