భారతదేశం, ఏప్రిల్ 24 -- పాకిస్థాన్‌పై భారత్ ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్‌ నిలిపివేసింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కశ్మీర్‌లో పౌరులపై జరిగిన ఘోరమైన దాడి తర్వాత సీమాంతర ఉగ్రవాదానికి ఇస్లామాబాద్ మద్దతు ఇస్తోందని భారత్ పేర్కొంది. బుధవారం పాకిస్థాన్ పై దౌత్యపరమైన చర్యలు తీసుకున్న మరుసటి రోజే పాక్ ప్రభుత్వ ఎక్స్ ఖాతను కూడా భారత్ నిలిపివేసింది.

పహల్గామ్ సమీపంలోని బైసరన్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చిన మరుసటి రోజే కీలకమైన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేయడం, కశ్మీర్‌లోని ప్రధాన భూ సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేయడం సహా భారత్ ఈ చర్యలు తీసుకుంది. పాక్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బ...