భారతదేశం, ఆగస్టు 27 -- అమెరికా అనేక భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధిస్తుంది. ఇది అమెరికాకు భారతదేశం చేసే ఎగుమతుల్లో అనేక వస్తువులపై ప్రభావం చూపుతుంది. భారత వస్తువుల దిగుమతిపై డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం అధిక సుంకం, భారత వస్తువులకు అమెరికా అతిపెద్ద మార్కెట్ కాబట్టి..48 బిలియన్ డాలర్లకు పైగా విలువైన భారత ఎగుమతులను ప్రమాదంలో పడేస్తోంది.

50 శాతం సుంకం వల్ల ప్రభావితమయ్యే రంగాలలో ఆటో విడిభాగాలు, వస్త్రాలు, దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, ఆక్వారంగం, కార్పెట్‌లు, ఫర్నిచర్, వ్యవసాయం, ప్రాసెస్డ్ ఫుడ్ , మెటల్ (ఉక్కు, అల్యూమినియం, రాగి) ఉన్నాయి. ఈ సుంకం భారతదేశం మొత్తం జీడీపీని కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అమెరికా భారతదేశం అతిపెద్ద దిగుమతిదారు. భారతదేశానికి ఈ నష్టం అనేక దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా వంటి ...