భారతదేశం, మే 5 -- పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు నిరంతరం దెబ్బతింటున్నాయి. మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన పలు సైబర్ గ్రూపులు భారత్‌పై సైబర్ దాడులకు దిగాయి. పాక్ హ్యాకర్లు భారత రక్షణ వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. సైబర్ దాడుల ద్వారా భద్రతా సిబ్బంది లాగిన్ పాస్‌వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు రాబట్టేందుకు ప్రయత్నించారని రక్షణ సంస్థ వర్గాలు తెలిపాయి.

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌కు చెందిన సున్నితమైన డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసుకున్నట్టుగా పాకిస్థాన్ సైబర్ ఫోర్స్ అనే హ్యాండిల్ పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లిక్ ఆర్మ్‌డ్ వెహికల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేసేందుకు ఈ బృందం ప్రయత్నించిందని ఎన్డీటీ...