భారతదేశం, డిసెంబర్ 25 -- భారత్, చైనాల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలను చూసి అమెరికా ఓర్వలేకపోతోందని, ఇరు దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని చైనా తీవ్ర ఆరోపణలు చేసింది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. అమెరికా తన రక్షణ విధానాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ భారత్‌తో తమకున్న సత్సంబంధాలను దెబ్బతీసేందుకు చూస్తోందని మండిపడ్డారు.

ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి నెలకొనడంపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు లిన్ జియాన్ సమాధానమిస్తూ.. తాము భారత్‌తో సంబంధాలను 'వ్యూహాత్మక, సుదీర్ఘ కాలం' పాటు కొనసాగే దృక్పథంతో చూస్తామని స్పష్టం చేశారు. అయితే, అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ఇటీవల కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో.. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తన 'కీలక ప్రయోజనాల్లో' (Core Interests) భా...