భారతదేశం, ఏప్రిల్ 20 -- బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు క్షీణించాయి. ఇప్పుడు భారత్‌పై బంగ్లాదేశ్ మరో కుట్రకు తెరలేపింది. దక్షిణ త్రిపురలోని ముహూరి నది సమీపంలో కరకట్టను నిర్మిస్తోంది. దీంతో సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వరద భయాలు పెరిగాయి. బెలోనియాకు చెందిన సీపీఐ(ఎం) ఎమ్మెల్యే దీపాంకర్ సేన్ ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, నదిపై నిర్మిస్తున్న ఈ కరకట్ట ఒకటిన్నర కిలోమీటర్ల పొడవు, 20 అడుగుల ఎత్తు ఉంది. ఇందిరా-ముజీబ్ ఒప్పందం ప్రకారం సరిహద్దుకు 150 గజాల పరిధిలో ఏ దేశమూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఈ ఒప్పందం తర్వాత కూడా ఈ కరకట్టను సరిహద్దుకు 50 గజాల దూరంలో, కొన్ని చోట్ల 10 గజాల దూరంలో నిర్మిస్తున్నారు. గతంలో ఈ ఒప్పందం కార...