భారతదేశం, ఏప్రిల్ 10 -- ముంబయి 26/11 ఉగ్రదాడిలో కీలక వ్యక్తి తహవూర్ హుస్సేన్ రాణా. అతడికి అమెరికాలో చర్టపరంగా అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు అమెరికా అధికారులు భారత్‌కు అప్పగించారు. ప్రత్యేక విమానంలో అతడిని భారత్‌కు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం విమానం దిల్లీకి చేరుకోగానే.. అతడిని ఎన్ఐఏ, RAW సంయుక్త బృందం అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

మెుదట దిల్లీలో కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. తర్వాత తీహార్ జైలులోని హై సెక్యూరిటీ వార్డులో ఉంచే ఛాన్స్ ఉంది. నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, హత్య, ఫోర్జరీతోపాటుగా మరికొన్ని అభియోగాలు తహవూర్ రాణాపై నమోదు అయ్యాయి.

ఇదిలా ఉండగా ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది. అందులో తహవూర్ రాణా తప్పులు బహిర్గతమయ్యాయి. దాడికి ముందు భారత్‌లో పర్యటించిన సమయంలో పాక్-అమెరికన్...