భారతదేశం, జనవరి 8 -- రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా అడ్డుకట్ట వేసే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన 'రష్యా ఆంక్షల బిల్లు-2025'కు ఆయన పచ్చజెండా ఊపారు.

అమెరికాలోని రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలు సంయుక్తంగా (Bipartisan) రూపొందించిన ఈ బిల్లు లక్ష్యం ఒక్కటే.. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. ఉక్రెయిన్‌పై పుతిన్ సాగిస్తున్న యుద్ధానికి అవసరమైన నిధులు చమురు విక్రయాల ద్వారానే అందుతున్నాయని అమెరికా భావిస్తోంది.

500% టారిఫ్: రష్యా నుంచి చమురు, గ్యాస్ లేదా యురేనియం దిగుమతి చేసుకునే దేశాల ఉత్పత్తులపై అమెరికా కనీసం 500% పన్ను (Tariff) విధిస్తుంది. ఇది నేరుగా భారత్, చైనా వంటి ప్రధాన కొనుగోలుదా...