భారతదేశం, ఆగస్టు 23 -- ఇంటర్ లేదా 12వ తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోసం కళాశాలల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఫేక్​ యూనివర్సిటీల సమస్య పెరుగుతోంది! నకిలీ యూనివర్సిటీల వల్ల విద్యార్థులు మోసపోయే ప్రమాదం ఉంది. ఇవి అందించే డిగ్రీలకు భారతీయ ఉన్నత విద్యా మండలి వద్ద గుర్తింపు ఉండదు. అందువల్ల, భవిష్యత్తును కాపాడుకోవడానికి, విద్యార్థులు చేరే ముందు ఆ యూనివర్సిటీ నిజమైనదా కాదా అని నిర్ధారించుకోవాలి.

భారతదేశంలో ఉన్నత విద్యను నియంత్రించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తమ అధికారిక వెబ్‌సైట్ (ugc.gov.in)లో నకిలీ యూనివర్సిటీల జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది. విద్యార్థులు ఏదైనా కళాశాలలో చేరే ముందు ఈ జాబితాను తప్పకుండా తనిఖీ చేయాలి.

నిజమైన యూనివర్సిటీ.. యూజీసీ ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. కొన్నిస...