భారతదేశం, డిసెంబర్ 9 -- తమ దేశంలోకి దిగుమతి అవుతున్న భారతీయ బియ్యంపై అదనపు సుంకాలను విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు "వారు (భారత్) ఈ వస్తువును అమెరికాలో 'డంపింగ్' చేయకూడదు" అని అన్నారు.

అమెరికన్ రైతులకు 12 బిలియన్ డాలర్ల తాజా సహాయాన్ని ప్రకటించడానికి వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయ ఉత్పత్తిదారులు దిగుమతుల కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కెన్నెడీ రైస్ మిల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన మెరిల్ కెన్నెడీ (రైస్ బారన్) బియ్యం ధరలు తగ్గుతున్న విషయాన్ని ట్రంప్‌నకు వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తన ఉద్దేశాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు.

అమెరికాలోకి "బియ్యం డంపింగ్" చేస్తున్న దేశాల జాబితాను ట్రంప్‌కు అందించగా.. ఇందులో భారత్, థాయ్...