భారతదేశం, జూలై 30 -- అనేక దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. భారత్​ దిగుమతులపై వేసే టారీఫ్​ల గురించి తాజాగా కామెంట్స్​ చేశారు. ఇండియాపై 20 నుంచి 25శాతం వరకు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే, ఈ విషయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వెల్లడించారు. అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపై​ తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో ట్రంప్​ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండియా దిగుమతులపై 20-25శాతం వరకు సుంకాలు విధిస్తారా? అని రిపోర్టర్లు అడిగినప్పుడు.. "అనుకుంటున్నాను," అని అమెరికా అధ్యక్షుడు బదులిచ్చారు.

"అమెరికాకి ఇండియా మంచి మిత్రదేశంగా ఉంది. కానీ మరే ఇతర దేశం విధించనంత టారీఫ్​లు మాపై విధిస్తోంది. అలా చేయకూడదు," అని ట్రంప్​ అభిప్రాయపడ్డారు.

టారీఫ్​లతో పాటు భారత్​-పాక్​ వ్యవహారాలపైనా ...