భారతదేశం, ఏప్రిల్ 25 -- పహల్గామ్​​ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ, శుక్రవారం ఉదయం నియంత్రణ రేఖ (ఎల్​ఓసీ) వెంబడి కొన్ని చోట్ల పాకిస్థాన్​ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలో పాక్​ చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా ప్రతిఘటించింది.

పహల్గామ్​లో టూరిస్ట్​లను ఉగ్రవాదులు కాల్చి చంపిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎల్​ఓసీ వెంబడి కాల్పుల మోత మోగింది. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్​తో ఇప్పటికే బలహీనంగా సంబంధాలను భారత్​ మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

ఇక ఎల్​ఓసీ వెంబడి తాజా పరిస్థితులపై భారత సైన్యం స్పందించింది.

"ఎల్​ఓసీ వెంబడి కొన్ని చోట్ల పాకిస్థాన్​ సైన్యం చిన్న ఆయుధాలతో ఫైరింగ్​ ప్రారంభించింది. భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేేదు. మరిన్...