భారతదేశం, జూలై 23 -- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం బ్రిటన్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారతదేశం, యూకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారు. దీని కారణంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. 2030నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించారు.

భారతదేశం-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గత మూడు సంవత్సరాలుగా చర్చల దశలో ఉంది. ఇది గత మేలో ఖరారు అయింది. ఇప్పుడు రెండు దేశాలు ఒప్పందంపై సంతకం చేయనున్నాయి. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశం ఎలా ప్రయోజనం పొందుతుందో చూద్దాం..

సంతకం చేసిన ఒక సంవత్సరం లోపు అమల్లోకి వచ్చే భారతదేశం-యూకె స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రకారం.. భారతదేశం కొన్ని ఆహార పదార్థాలు, బ్రిటిష్ విస్కీ, కార్లపై సుంకాలను తగ్గిస్తుంది. భారతదేశం వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు, ...