భారతదేశం, మే 11 -- బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య సీజ్‌ఫైర్‌పై సల్మాన్ రియాక్టయ్యారు. ఎక్స్ లో పోస్టు పెట్టారు. దీంతో సల్మాన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ పై ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు. దీంతో సల్మాన్ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్‌పై స్పందించకపోవడంతో వ్యతిరేకత ఎదురైన తర్వాత దాన్ని తొలగించారు.

శనివారం (మే 10) భారత్, పాకిస్థాన్ మధ్య సీజ్‌ఫైర్‌ అనౌన్స్ చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ ఎక్స్ లో ''సీజ్‌ఫైర్‌ కు దేవునికి ధన్యవాదాలు'' అని ట్వీట్ చేశారు. వెంటనే ఈ ట్వీట్ వైరల్ గా మారింది. భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణపై సల్మాన్ రియాక్టవడం ఓ వర్గం నెటిజన్లు ఏ మా...