భారతదేశం, మే 9 -- యుద్ధ భయాల మధ్య స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 507.64 పాయింట్లు తగ్గి 79,827.17కి చేరుకోగా, నిఫ్టీ 50 సూచీ 160 పాయింట్లు తగ్గి 24,113.80కి చేరుకుంది. దాదాపు అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు రెడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండో పాక్ ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, సెల్లింగ్ కు వెళ్తుండడంతో మార్కెట్ రెడ్ లో కొనసాగుతోంది.

స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాల్లో ట్రేడవుతుండడంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. మరోవైపు, భారత్, పాక్ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నది పెట్టుబడిదారులకు అయోమయంగా మారింది.

అయితే, ఈ పరిస్థితిపై పెట్టుబడిదారులు భయపడవద్దని, స్వల్ప కాలిక నష్టాలన...