భారతదేశం, ఆగస్టు 11 -- భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని నెరవేర్చే లక్ష్యంతో భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యాలను అందిస్తోంది. ఇకపై వేగవంతమైన హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్టుగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆగస్టు 8న రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఉచిత వై-ఫై సేవ ఉన్న మొత్తం రైల్వే స్టేషన్ల సంఖ్యపై రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు .

'భారతీయ రైల్వేలలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించే 4G/5G కవరేజ్ ఉంది. ఈ నెట్‌వర్క్‌లను ప్రయాణికులు డేటా కనెక్టివిటీ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రయాణికుల అనుభవం మెరుగుపడుతుంది. పైన పేర్కొన్న వాటితో పాటు, ...