భారతదేశం, ఆగస్టు 14 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా దూసుకెళుతున్న 'ఎంజీ విండ్సర్ ఈవీ'.. జులై 2025లో తన అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలో ఏకంగా 4,308 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు మార్కెట్​లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 36,000 యూనిట్లకు పైగా అమ్ముడై, ఈ సెగ్మెంట్​లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. విండ్సర్ ఈవీ అమ్మకాల జోరుతో ఎంజీ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వాటా క్యూ2 2025లో 32 శాతానికి పెరిగింది. ఇది గత త్రైమాసికం కంటే 4 శాతం ఎక్కువ! ఇదే కాలంలో విండ్సర్ సగటు అమ్మకాలు 17 శాతం పెరగ్గా, కంపెనీ మొత్తం ఈవీ హోల్‌సేల్ అమ్మకాలు 28 శాతం వృద్ధి సాధించాయి.

ఎంజీ విండ్సర్ ఈవీ డిజైన్ ఇతర క్రాసోవర్ వాహనాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో హ్యాచ్‌బ్యాక్, ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీల స్టైల్స్ కలగలిపి ఉంటాయి. ముందు భాగం...