భారతదేశం, సెప్టెంబర్ 11 -- జాతీయ మహిళా కమిషన్ విడుదల చేసిన నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ 2025 నివేదిక ప్రకారం, విశాఖపట్నం భారతదేశంలోని మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా అవతరించింది. ఈ లిస్టులో మెుదటి స్థానంలో కోహిమా ఉండగా రెండో స్థానంలో విశాఖపట్నం ఉంది. ఆ తర్వాత భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఇటానగర్, ముంబై కూడా ఉన్నాయి. ఈ నగరాలు లింగ సమానత్వం, పౌర భాగస్వామ్యం, ప్రభావవంతమైన పోలీసింగ్, మహిళా అనుకూల మౌలిక సదుపాయాలలో అధిక స్కోరు సాధించాయని సర్వే చెబుతోంది.

సమగ్ర భద్రతా అంచనాలో వైజాగ్ నగరం 72.7 శాతం స్కోర్ సాధించింది. ఇది జాతీయ సగటు 64.6 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 12,770 మంది మహిళలు పాల్గొన్నారు. విశాఖపట్నం కోసం వచ్చిన గణాంకాల ప్రకారం చూస్తే.. 8...