Hyderabad, సెప్టెంబర్ 1 -- భాద్రపద పౌర్ణమి 2025: పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. భాద్రపద పౌర్ణమి కూడా ఎంతో ప్రత్యేకమైనది. భాద్రపద పౌర్ణమి నాడు శ్రార్థ, తర్పణాలు వంటి వాటిని అనుసరించడం వలన పితృ దేవతలు సంతోషంగా ఉంటారు. పితృ దేవతల అనుగ్రహంతో సమస్యలన్నీ తీరిపోతాయి. అదే విధంగా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ఈ ఏడాది భాద్రపద పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? భాద్రపద పౌర్ణమి తేదీ, సమయం, పూజా విధితో పాటుగా మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రిక్ పంచాంగం ప్రకారం భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 6న మొదలై సెప్టెంబర్ 7తో ముగుస్తుంది. సెప్టెంబర్ 6 ఉదయం 1:51కి మొదలై, సెప్టెంబర్ 7 రాత్రి 11:38కి ముగుస్తుంది. కనుక సెప్టెంబర్ 7 ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి వచ్చింది.

పౌర్ణమి నాడు దానాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. పౌర్ణమి నాడు ధాన్యం, డబ్బు, వస్త్...