భారతదేశం, జనవరి 6 -- హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(HILT) పాలసీపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. హిల్ట్ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారని, దీనిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతుందని క్లారిటీ ఇచ్చారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ బాబు వెల్లడించారు.

'నగర కాలుష్యాన్ని తగ్గించడానికి పరిశ్రమలను ఓఆర్ఆర్ దాటి తరలించనున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడటం, రాబోయే తరాలకు పరిశుభ్రమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. సమాజం ఆరోగ్యకరమైన, కాలుష్య రహిత వాతావరణాన్ని తదుపరి తరానికి అందిస్తుందో లేదో ఆత్మపరిశీలన చేసుకో...