భారతదేశం, జనవరి 13 -- వరుసగా మాస్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లతో, రొటీన్ స్టోరీలతో పెద్ద దెబ్బే తిన్నాడు రవితేజ. ఆయనకు వరుసగా ఫ్లాప్ లు వచ్చాయి. ఇప్పుడు హిట్ కోసం రూట్ మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ థియేటర్లకు వచ్చాడు. సంక్రాంతి 2026 సందర్బంగా ఇవాళ (జనవరి 13) రిలీజైంది ఈ మూవీ. మరి ట్విటర్ రివ్యూలో ఎలా ఉందో చూద్దాం.

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రీమియర్స్ విదేశాల్లో ముగిశాయి. సినిమా చూసిన ఆడియన్స్ తమ రివ్యూలను సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తున్నారు. మూవీకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా ఫస్టాఫ్ స్లోగా ఉందని కామెంట్ చేస్తున్నారు. సెకండాఫ్ కారణంగా మూవీని ఒకసారి చూడొచ్చని పోస్టులు పెడుతున్నారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో రొమాన్స్ చేశాడు. ఈ మూవీలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు...