Hyderabad, మే 13 -- భార్యాభర్తలుగా మారిన తర్వాత తల్లిదండ్రులుగా మారాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎంతోమంది అయితే కొంతమందికి మూడో నెలలో లేదా నాలుగో నెలలో గర్భస్రావం అవుతూ ఉంటుంది. అలా గర్భస్రావం అయినప్పుడు మహిళలదే తప్పుగా భావిస్తుంది సమాజం.

ఇంట్లో పెద్దవారు కూడా మహిళలని తప్పుపడుతూ ఉంటారు. భర్తకు ఎలాంటి సంబంధం లేదనుకుంటారు. నిజానికి భర్తలో ఉండే కొన్ని లోపాలు భార్య గర్భస్రావానికి కారణమవుతాయి. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అవగాహన లేక ప్రతిసారీ మహిళను నిందిస్తూ ఉంటారు.

భార్యకు గర్భస్రావం అయితే దానికి ఆమె మాత్రమే బాధ్యురాలు కాదు. భర్త కారణంగా కూడా ఆమెకు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. భర్తలో ఎలాంటి లోపాలు ఉన్నప్పుడు భార్యకు గర్భస్రావం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయో తెలుసుకోండి.

మగవారిలో కూడా పునరుత్పత్తి సమస్యలు లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువే. భ...