Hyderabad, మార్చి 11 -- భార్యాభర్తలు ఒకరి దగ్గర ఒకరు ఏ విషయాలు దాచకూడదని చెబుతారు. వారిద్దరి బంధం నమ్మకాన్నే పునాదిగా చేసుకొని ఉంటుందని అంటారు. అది పూర్తి శాతం నిజం. అయితే భార్యలు అన్ని విషయాలు భర్తల దగ్గర బహిరంగంగా చెప్పేస్తారు. కానీ భర్తలు మాత్రం ఒక మూడు విషయాలను తమ భార్యల దగ్గర దాస్తారు.

కొన్ని విషయాలు వారి సంబంధాన్నే నాశనం చేస్తాయి. అనుబంధాన్ని బలంగా ఉంచుకోవాలంటే భార్యాభర్తలు తమ సంబంధంలో పారదర్శకంగా ఉండాలి. కానీ భర్త కొన్ని విషయాలను భార్యకు చెప్పకుండా ఎందుకు దాచిపెడతారో, ఆ విషయాలు ఏంటో తెలుసుకోండి.

భర్తలు తరచుగా తమ భావోద్వేగాలను భార్యల నుండి దాచుకుంటారు. దీనికి సమాజం కూడా ఒక కారణమని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతీయ సమాజంలో పురుషులు బలవంతులని అంటారు. వారు ఏ నొప్పినైనా భరిస్తారని, వారు అమ్మాయిల్లా ఏడవరని కామెంట్లు విసురుతారు. అలాంటి నమ్మ...