భారతదేశం, ఏప్రిల్ 21 -- ఈ మధ్య తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా కొందరు పురుషులు వారి భార్యలకు బలయ్యారు. అయితే భార్యల చేతిలో.. లేకపోతే కాంట్రాక్ట్ కిల్లర్స్ చేతిలో భర్తలు చనిపోయారు. కొందరు ప్రాణాలతో భయటపడి.. పోలీసులను అశ్రయించారు. అయితే.. అసలు భార్యాభర్తలు చంపుకునే వరకు ఎందుకు వెళ్తున్నారు.. కారణాలు ఏంటి అనేదానిపై 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' తెలంగాణకు చెందిన ఏసీపీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారితో మాట్లాడింది. అప్పుడు ఆయన 10 విషయాలు చెప్పారు.

1.అక్రమ సంబంధాలు.. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడటం, ఆ సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో అతన్ని చంపడానికి ప్రేరేపించవచ్చు. ఇటీవల వరంగల్‌లో వైద్యుడిపై దాడి, అతను చనిపోవడం ఇందుకు ఉదాహరణ.

2.గృహ హింస.. భర్త నుండి భార్య నిరంతరం శారీరక, మానసిక లేదా లైంగిక హింసను ఎదుర్కొంటుంటే.. విసిగిపోయి ప్...