భారతదేశం, జనవరి 16 -- టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత రూత్ ప్రభు ఇంట సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పండగ కావడంతో సామ్ దీనిని చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త, ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి ఈ పండగను జరుపుకుంటూ ఆనందంలో మునిగితేలింది.

గురువారం (జనవరి 15) నాడు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అభిమానులకు ఒక క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కారులో ప్రయాణిస్తూ భర్తతో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఇందులో ఇద్దరూ ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు.

రాజ్ కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తుండగా.. సమంత మాత్రం మూతి ముందుకు పెట్టి చాలా కొంటెగా ఫోటోకి పోజులిచ్చింది. "సంక్రాంతి వైబ్స్" అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చింది. పెళ్లి తర్వాత సామ్ ఎంత సంతోషంగా, ఉల్లాసంగా ఉందో చెప్పడానికి ఈ ఫ...