భారతదేశం, ఫిబ్రవరి 12 -- వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫైర్ అయింది. తన భర్త నిక్ జోనస్ నుంచి ఆమె విడిపోతుందని, విడాకులు తీసుకుంటుందనే పుకార్లపై సీరియస్ గా రియాక్టయింది. ఇవన్నీ కుట్రతో కూడిన వదంతులు అని ఆమె స్పష్టం చేసింది. తమ పెళ్లి జీవితం బ్లాస్ట్ కావాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

విడాకుల పుకార్లపై ప్రియాంక చోప్రా స్పందించింది. 'వెరైటీ'తో ప్రియాంక మాట్లాడుతూ.. "మా పెళ్లి బంధం బ్లాస్ట్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏదేమైనా అది వాళ్ల భ్రమ. మా ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ప్రజలకు ఎందుకు ఇంత ఇబ్బంది కలిగిస్తుందో అర్థం కావడం లేదు'' అని తెలిపింది.

"మేము ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నాం. ప్రజలు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేశా. మా విషయంలో జనాలకు అంత ఇబ్బంది కలిగించింది ఏంటో నాకు అర్థం కావడం లేదు. బహుశా వేర్వేరు దేశాలు, వేర్వ...