భారతదేశం, సెప్టెంబర్ 7 -- ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేసేందుకు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. తెలుగులో కొత్త సీజన్ ఇవాళ (సెప్టెంబర్ 7) స్టార్ట్ కాబోతోంది. మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి తెర లేస్తుంది. సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సారి సీజన్ లో ట్విస్ట్ లు మామూలుగా ఉండట్లేదని తెలిసింది. ప్రోమో చూస్తూనే ఆ విషయం అర్థమైంది.

బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలు వెళ్లడం, ఆటలాడం కామనే. కానీ ఈ సారి బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ లో మాత్రం సెలబ్రిటీలకు చుక్కలు కనిపించబోతున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సారి బిగ్ బాస్ లో ఒకటి కాదు రెండు హౌస్ లు ఉండబోతున్నాయి. ఇందులో ఒక హౌస్ ను అత్యంత లగ్జరీగా ఉన్నట్లు చూపించారు. అంటే మరో హౌస్ కనీస వసతులతో సాధారణంగా ఉండబోతుందని అంచనా. ఓనర్లు, టెనెంట్...