భారతదేశం, డిసెంబర్ 16 -- భారత జాతీయ రూపాయి విలువ పతనం మంగళవారం కూడా కొనసాగింది. ఉదయం జరిగిన ట్రేడింగ్‌లో అమెరికా డాలర్​తో పోలిస్తే రూపాయి 91.19 వద్ద కొత్త కనిష్టాన్ని తాకింది. ఈ పతనంతో, ఈ సంవత్సరంలో (వైటీడీ) భారత రూపాయి విలువలో 6% క్షీణత నమోదైంది. జాతీయ కరెన్సీలో ఈ పతనం ఫారెక్స్ పెట్టుబడిదారుల రాబడిని నేరుగా దెబ్బతీసినప్పటికీ, ఇది బంగారం, వెండి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రాబడిని కూడా పరోక్షంగా ప్రభావితం చేసింది! ఈ నేపథ్యంలో రూపాయి బలహీనపడుతూ ఉంటే మన స్టాక్​, మ్యూచువల్​ ఫండ్​, గోల్డ్​ పోర్ట్​ఫోలియో ఎలా ప్రభావితం అవుతుంది? అన్న విషయాన్ని నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాము..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రూపాయి పతనం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్​ఐఐ) సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇది భారత స్టాక్ మార్కెట్‌లో ఎఫ్​ఐఐల ...