Telangana, సెప్టెంబర్ 10 -- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వాటర్ సంప్ లోకి దిగిన ముగ్గురు కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చర్ల మండలంలోని ఉంజుపల్లిలో జరిగింది.

తాగునీటి సరఫరా పథకంలో భాగంగా ఓ సంపును నిర్మిస్తున్నారు.ఈ పనిలో భాగంగా నలుగురు కార్మికులు ఇక్కడ సిమెంట్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు కార్మికులు చనిపోయారు.

సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక కార్మికుడు మొదట సంప్ లోకి ప్రవేశించి సహాయం కోసం పిలిచాడు. మరో ముగ్గురు అతన్ని రక్షించడానికి వెళ్లారు. కాని అక్కడ సరైన స్థాయిలో ఆక్సిజన్ లేకపోవడంతో ఇద్దరు అపస్మారక స్థితిలో వెళ్లిన తర్వాత తరువాత మరణించారు. మిగిలిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

సంప్ లోపల ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్లే ఈ విష...