Telangana,andhrapradesh, జూలై 12 -- ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 10 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

ముందస్తుగా ప్రభావితం చూపే అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ...