భారతదేశం, ఏప్రిల్ 29 -- పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా జమ్మూకశ్మీర్ లోని 48 పబ్లిక్ పార్కులు, పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. కశ్మీర్ లోని 87 పబ్లిక్ పార్కులు, ఉద్యానవనాల వంటి పర్యాటక కేంద్రాల్లో 48 పర్యాటక కేంద్రాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

మూసివేసిన ప్రదేశాలలో దూష్పత్రి, కోకెర్నాగ్, డుక్సమ్, సింథాన్ టాప్, అచ్ఛబాల్, బంగస్ వ్యాలీ, మార్గన్ టాప్, తోసమైదాన్ వంటి ప్రసిద్ధ, అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రకటించనప్పటికీ, ఈ పర్యాటక ప్రదేశాల మూసివేతను క్షేత్రస్థాయిలో అమలు చేశారు. గేట్లకు తాళం వేసి, వాటిలోకి ప్రవేశాలను నిలిపివేశారు.

దక్షిణ కాశ్మీర్ లోని అనేక మొఘల్ గార్డెన్స్ లలో కూడా పర్యాటకుల ప్రవేశాలను నిలిపివేశారు. పహల్గామ్ ర...