భారతదేశం, జనవరి 5 -- కొత్త ఏడాది ఆరంభంలోనే పసిడి ప్రియులకు షాక్ తగిలింది. సోమవారం (జనవరి 5) ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న అనూహ్య భౌగోళిక రాజకీయ పరిణామాలు బులియన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించాయి.

గత వారాంతంలో వెనెజువెలాపై అమెరికా జరిపిన సైనిక చర్య ఈ బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశంలో ఇలాంటి అస్థిర పరిస్థితులు నెలకొనడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు భద్రత కోసం బంగారం, వెండి వైపు మొగ్గు చూపారు.

ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్​లో స్పాట్ గోల్డ్ 1.5% పెరిగి 4,395 డాలర్లకు చేరగా, ఫ్యూచర్స్ 4,418 డాల...