భారతదేశం, జనవరి 2 -- టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా శంబాల. అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, ఇంద్రనీల్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన శంబాల మంచి టాక్‌తో పేరు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శంబాల సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో శంబాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోవడంపై డైరెక్టర్ యుగంధర్ ముని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. "శంబాల సక్సెస్‌కి నేను ఒక్కడిని కారణం కాదు. ఇదంతా టీమ్ వర్క్. నా నిర్మాతలు మహీధర్ గారు, రాజశేఖర్ గారి సపోర్ట్ వల్లే చిత్రం ఇంత బాగా వచ్చింది. ఆది గారు లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రకు న్యాయం చేశారు" అని అన...