Andhrapradesh, జూన్ 24 -- తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కోనుగోలుకు టీటీడీ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులకు మరింత సులభతరంగా లడ్డూలను కోనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులో ఉంచింది.

ఈ సదుపాయం ద్వారా భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించి త్వరితగతిన లడ్డూల కొనుగోలు ప్రక్రియ చేసేలా అవకాశం కల్పించడం జరిగింది. యూపీఐ చెల్లింపు సదుపాయం ద్వారా నగదు లేకుండా పారదర్శక లావాదేవీలు జరిగేలా టీటీడీ ఏర్పాటుచేసింది.

భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి నుండి విశేష స్పందన లభిస్తోందని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....