భారతదేశం, డిసెంబర్ 10 -- ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, మహారాష్ట్రలోని సాయినగర్ షిర్డీ రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలను కలిపే కొత్త వీక్లీ ప్రత్యేక రైలు సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. ఈ రైలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర గుండా నడుస్తుంది. ఈ మార్గంలో 31 ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఈ సేవను రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఏపీ రోడ్లు, భవనాల మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి.. తిరుపతి నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోమన్న మాట్లాడుతూ.. తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నాలుగు రాష్ట్రాలలోని భక్తులకు ఒక ముఖ్యమైన రోజు అని అన్నారు. ఈ రైలు ఇప్పుడు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్ వంటి ప్రధాన స్టేషన్లను నేరుగా కలుపుతుందని, యాత్రికులకు ప్రయాణ సౌకర్యాన్ని మెరు...