భారతదేశం, నవంబర్ 26 -- తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ భక్తులు వేలాదిగా తరలివస్తారు. వెంకటేశ్వరస్వామి కోసం మొక్కులు చెల్లింస్తుంటారు. కొందరు భక్తులు బంగారం, వెండి, నగదు ఇలా వారికి తోచిన విధంగా స్వామికి కానుకలు ఇస్తుంటారు. అలాగే కొందరు భక్తులు స్వామివారికి భారీ విరాళాలు కూడా ఇస్తుంటారు. ఇటీవలే కాలంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఓ భక్తుడు ఏకంగా రూ. 9 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం మీడియాకు వెల్లడించారు.

పీఏసీ 1, 2 3 భవనాల అధునీకరణ కోసం మంతెన రామలింగ రాజు అనే భక్తుడు రూ.9 కోట్లు విరాళం అందజేశారు. ఆయన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట దీన్ని ఇచ్చారు.ఇదే భక్తుడు 2012లో కూడా టీటీడీకి రూ.16 కోట్లు విరాళమిచ్చారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు గుర్తు చేశారు. భక్తులకు ...