భారతదేశం, జనవరి 6 -- మతపరమైన భక్తి కార్యక్రమం (జాగ్రాన్)లో నటి సుధా చంద్రన్ తీవ్రమైన భావోద్వేగాలకు లోనైన వీడియోలు వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆత్మజ్ఞాన స్థితిలో ఆమె ఉద్వేగానికి లోనైనట్లు వీడియోలలో కనిపించింది. అయితే, ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాక తనను కొందరు విమర్శించారని, ఈ సంఘటనను కేవలం నాటకమని కొట్టిపారేశారని సుధా చంద్రన్ వెల్లడించారు. దీనిపై ఆమె రియాక్టయ్యారు. తన భక్తిని నాటకమన్నారని తెలిపారు.

జూమ్ ఇంటర్వ్యూలో సుధా చంద్రన్ తన అనుభవాన్ని, వీడియోలు సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించిన తర్వాత తనకు ఎదురైన ట్రోలింగ్‌ను గురించి మాట్లాడారు. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు తన ఆత్మజ్ఞాన స్థితిని 'నకిలీ', 'నాటకం' అని కొట్టిపారేశారని ఆమె చెప్పారు.

దీని గురించి మాట్లాడుతూ.. ''నేను వివరణ ఇవ్వడానికి ఇక్కడ లేను. జీవితం పట్ల నాకం...