భారతదేశం, జనవరి 1 -- టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అధ్యక్షత‌న‌ బ‌ర్డ్ ఆసుప‌త్రి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక‌లాపాల‌పై తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్‌లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం నిర్వహించారు. ఈ స‌మావేశాలలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

అంత‌కుముందు హిందూ ధ‌ర్మ ప్రచార ప‌రిష‌త్ కార్యక‌లాపాల‌పై ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో హిందూ ధ‌ర్మ ప్రచారాన్ని మ‌రింత విస్తృతం చేసేందుకు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్, సింఘాల్‌, టీటీడీ బోర్డు స‌భ్యులు జాన‌కి దేవి, నరేష్ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా.జగదీశ్, హెచ్‌డీపీపీ సెక్రట‌రీ శ్రీ‌రామ్ ర‌ఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు శ్రీవారి ఆలయ ప్రా...