భారతదేశం, జూలై 16 -- బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు ఆదిత్య ఓం. టాప్ కంటెస్టెంట్‌గా ఫైన‌ల్ వ‌ర‌కు వ‌స్తాడ‌ని బిగ్‌బాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అనూహ్యంగా 32వ రోజే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ త‌ర్వాత తిరిగి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టిన ఆదిత్య ఓం ప్ర‌యోగాల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిస్తున్నాడు.

తాజాగా ఆదిత్య ఓం ద‌ర్శ‌కుడిగా మారి ఓ బ‌యోపిక్ మూవీని రూపొందించారు. 'సంత్ తుకారం' టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ జూలై 18న రిలీజ్ కాబోతుంది. తెలుగు, హిందీ, మ‌రాఠీతో పాటు ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌బోతున్నారు.

17వ శతాబ్దపు మరాఠీ సాధువు-కవి సంత్ తుకారాం జీవితం, వారసత్వం, సాహిత్య విప్లవం ఆధారంగా ఆదిత్య ఓం ఓ సినిమాను రూపొందించాడు. సంత్ తుకారం మూవీలో ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే టైటిల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు...