భారతదేశం, సెప్టెంబర్ 18 -- కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ మూవీ ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో విలన్ మహాబీర్ లామా (బ్లాక్ స్వోర్డ్) పాత్రను మంచు మనోజ్ పోషించాడు. విలనిజంతో విజిల్స్ కొట్టించాడు. అయితే మిరాయ్ క్లైమాక్స్ లో బ్లాక్ స్వోర్డ్ చనిపోలేదని, ఇంకా యుద్ధం మిగిలే ఉందనే అర్థం వచ్చేలా మనోజ్ కామెంట్లు ఉన్నాయి.

హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిరాయ్ సీక్వెల్ లో బ్లాక్ స్వోర్డ్ తిరిగొస్తాడని చూచాయగా చెప్పాడు మంచు మనోజ్. సినిమా చివరలో ఆశోక చక్రవర్తి వదిలిపెట్టిన తొమ్మిది గ్రంథాలపై నియంత్రణ సాధించిన బ్లాక్ స్వోర్డ్ పవర్ పొందుతాడు. తేజ సజ్జ పాత్ర వేదను ఓడించేలా కనిపిస్తాడు.

కానీ తనను తాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వేద ...