భారతదేశం, డిసెంబర్ 1 -- ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మే' భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి వారాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ లవ్ స్టోరీకి ఆడియన్స్ నుంచి అపూర్వమైన స్పందన దక్కుతోంది. శుక్రవారం (నవంబర్ 28) ప్రపంచవ్యాప్తంగా తేరే ఇష్క్ మే మూవీ రిలీజైంది. తెలుగులోనూ 'అమర కావ్యం' పేరుతో డబ్ చేశారు. మరి ఈ సినిమా మూడు రోజుల్లో ఎన్ని రూ.కోట్లు కొల్లగొట్టిందో చూద్దాం.

తేరే ఇష్క్ మే తన ఫస్ట్ వీకెండ్ ను ఘనంగా ముగించింది. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం సండే ముగిసే సరికి మంచి వసూళ్లను ఖాతాలో వేసుకుంది. మూడు రోజుల్లో కలిపి సుమారు రూ.48.35 కోట్ల కలెక్షన్లు దక్కించుకుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ట్రేడ్-సైట్ సక్నిల్క్ డేటా ప్రకారం.. ఈ చిత్రం శుక్రవారం రూ.16 కోట్లతో బలమైన ఓపెనింగ్ అందుకుంది. ఆ తర్వాత శనివారం రూ.17 కోట్లు, ఆద...