భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఈ ఏడాది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసిన యానిమేటెడ్ మూవీ 'మహావతార్ నరసింహా'. శ్రీ విష్ణువు అవతారాల్లో ఒకటైన నరసింహా అవతారం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా స్ఫూర్తితో తెలుగులోనూ ఓ దేవుడి కథ యానిమేషన్ సినిమాగా రాబోతుంది.

పురాణాల్లో హనుమంతుడిని తలుచుకోగానే ఓ ధైర్యం, నమ్మకం, భక్తి, సాహసం లాంటివి గుర్తుకొస్తాయి. ఇప్పటికే ఆంజనేయుడి పాత్ర ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు తెలుగులో హనుమంతుడి కథతో యానిమేషన్ ఫిల్మ్ రాబోతుంది. 'వాయుపుత్ర' టైటిల్ తో ఇది ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మూవీ టైటిల్ రివీల్ చేస్తూ ఇవాళ (సెప్టెంబర్ 1...