Hyderabad, మే 6 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి గతేడాది అక్టోబర్ లో వచ్చిన సంచలన విజయం సాధించిన మూవీ పని (Pani). ప్రముఖ నటుడు జోజు జార్జ్ తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కాస్త వయోలెన్స్ ఎక్కువైనా.. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ముఖ్యంగా ఊహకందని క్లైమ్యాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రానున్నట్లు జోజు జార్జ్ కన్ఫమ్ చేశాడు.

జోజు జార్జ్ ఇప్పటికే ఎన్నో మలయాళం సినిమాల్లో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. అయితే పని మూవీతో తొలిసారి డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్లు అతడు వెల్లడించాడు. అంతేకాదు మొత్తంగా మూడు భాగాలు రానున్నట్లు కూడా చెప్పడం విశేషం.

పని 2 మూవీని కన్ఫమ్ చేయడమే కాదు.. ఇది తొలి భాగం కంటే మరింత తీవ్రంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పాడు. అయితే తొలి పార్ట్ తో ఎలాంటి డైరెక్...