Hyderabad, జూన్ 10 -- మలయాళ స్టార్ నటుడు దిలీప్ నటించిన తాజా మూవీ 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'. ఈ మూవీ త్వరలోనే డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూన్ 20 నుండి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. గత నెలలోనే థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించిన మూవీ ఇది.

మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ. దిలీప్, సిద్ధిక్, రానియా, ధ్యాన్ శ్రీనివాసన్, జానీ ఆంటోనీ, మంజు పిళ్ళైలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కాగా.. జూన్ 20 నుంచి జీ5 ఓటీటీలోకి అడుగుపెడుతోంది.

ఈ మూవీ థియేటర్లలో మంచి ప్రదర్శన కనబరిచి, కుటుంబ ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించింది. 2017లో వచ్చిన 'రామలీల' తర్వాత నటుడు దిలీప్ కు మంచి వసూళ్లు సాధించి పెట్టిన సినిమాగా ఈ ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ న...